వలిగొండ, ఆలేరు స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలి
ABN, First Publish Date - 2022-03-05T06:31:11+05:30
వలిగొండ, ఆలేరు స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని కేంద్రమంత్రులు ఆశ్విన్‌వైష్ణవ్, జి.కిషన్‌రెడ్డికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు కోరారు. హైదరాబాద్‌లో వారిని శుక్రవారం కలిసి పలు సమస్యలను విన్నవించి వినతిపత్రం అందజేశారు.
కేంద్రమంత్రులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు వినతి
యాదాద్రి, మార్చి4 (ఆంధ్రజ్యోతి)/ఆలేరు: వలిగొండ, ఆలేరు స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని కేంద్రమంత్రులు ఆశ్విన్‌వైష్ణవ్, జి.కిషన్‌రెడ్డికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు కోరారు. హైదరాబాద్‌లో వారిని శుక్రవారం కలిసి పలు సమస్యలను విన్నవించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వా మి క్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు ఎంఎంటీఎస్ రైలు ఉపయోగపడుతుందని, కేంద్రం నిధులు మంజూ రు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో పనులు నిలిచాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసేలా ఒత్తిడి తేవాలని కోరారు. భువనగిరి అర్బన్ కాలనీలో 15వేల పైచిలుకు జనాభా ఉందని, ఈ ప్రాంతంలో రైల్వే అండర్‌పాస్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నారాయణాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రె్‌సలను వలిగొండలో నిలపాలన్నారు. స్వయంభు సోమేశ్వరస్వామి ఆలయం, జైనమతస్థులకు ఆరాధ్య కేంద్రమైన ఆలేరు జైన దేవాలయం, ఉద్యోగుల రాకపోకల దృష్ట్యా ఆలేరు రైల్వేస్టేషన్‌లో పద్మావతి, సింహపురి, దక్షిణ్, బీదర్, ఎంజీఎం కేవోపీ ఎక్స్‌ప్రె్‌సలు నిలిచేలా చూడాలన్నారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీ్‌పకుమార్, ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, నాయకులు దాసరి మల్లేష్, కర్నాటి ధనుంజయ్య, బంధారపు లింగస్వామి, నాయకులు దంతూరి సత్తయ్య, నాగేళ్లి సుధాకర్‌గౌడ్, బడుగు జహంగీర్, దూసరి రాఘవేంద్ర, రేగూరి అమరేందర్, తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-03-05T06:31:11+05:30 IST