ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ ఒక్కరు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి

ABN, First Publish Date - 2022-08-20T06:31:34+05:30

ప్రతీ ఒక్కరు సత్పవ ర్తన అలవర్చుకోవాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు.

జిల్లా కేంద్రంలోని సబ్‌జైలులో ఖైదీలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 19: ప్రతీ ఒక్కరు సత్పవ ర్తన అలవర్చుకోవాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌తో కలిసి సూర్యాపేట సబ్‌జైలులో ఖైదీలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ తప్పులు చేసి జైలుకు వెళ్లి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరు మాళ్ల అన్నపూర్ణ, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాఆనంద్‌, ఆర్డీవో రాజేంద్ర కుమార్‌, డీఎస్పీ పి.నాగభూషణం, డీఆర్‌డీవో సుందరి కిరణ్‌ కుమార్‌, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ జి. రాజశేఖర్‌, స్వరూపరాణి పాల్గొన్నారు.

- జాగృతి ఆధ్వర్యంలో  తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌ నుంచి క్రాస్‌రోడ్‌ వరకు 400 మీటర్ల జాతీయజెండాతో ఏర్పాటుచేసిన భారీ తిరంగా ర్యాలీని డీఎంహెచ్‌వో  కోటా చలం ప్రారంభించారు. అనంతరం క్రాస్‌ రోడ్డులో విద్యార్థులు జాతీయగీతం ఆలాపించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శివకుమార్‌, మునిసిపల్‌ కమిషనర్‌ దండు  శ్రీను, ఎంఈవో శాంతయ్య, జాగృతి నియోజకవర్గ ఇన్‌చార్జి గఫార్‌ఖాన్‌, జాగృతి యూత్‌ జిల్లా  అధ్యక్షుడు కేతిరెడ్డి సతీష్‌రెడ్డి, శ్రీకాంత్‌, మల్లయ్య,  పాల్గొన్నారు.

- సూర్యాపేట మండలం కాసరబాద రోడ్డులో ఉన్న అపూర్వ దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు శిశు సంక్షేమ శాఖ జిల్లా అఽధికారి జ్యోతి పద్మ, మునిపల్‌ చైర్మన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ స్వీట్లు పంపిణి చేశారు.  విద్యార్థులకు నిర్వ హించిన సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల కోసం మునిసిపల్‌, రెవెన్యూ ఉద్యోగులు 125కిలోల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో కరస్పాం డెంట్‌ మధనాచారి, మునిసిపల్‌ ఈఈ జీకేడీ ప్రసాద్‌, డీఈ సత్యారావ్‌, ఆర్వో జ్ఞానేశ్వరి, స్వరూపారాణి, సీడీపీవో వెంకటలక్ష్మి పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T06:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising