ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నృసింహుడికి శాస్ర్తోక్తంగా నిత్య కల్యాణం

ABN, First Publish Date - 2022-08-11T05:47:28+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవా రం సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగ మ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి.

లక్ష్మీనృసింహుల నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుట్టలో ఆరంభమైన ఆర్జిత సేవలు 

నేడు నగర సంకీర్తన

యాదగిరిగుట్ట, ఆగస్టు 10: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవా రం సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగ మ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. యాదగిరిక్షేత్రంలో, అనుబంధ పాతగుట్ట ఆలయాల్లో పవిత్రోత్సవాలను పురస్కరించుకుని రెండు రోజుల పాటు భక్తులు నిర్వహించుకునే నిత్య, శాశ్వత కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, సుదర్శన హోమ పూజలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. పవిత్రోత్సవాలు మంగళవారం ముగియడంతో ఆర్జిత సేవలను, హోమ పూజలను అధికారులు పునరుద్ధరించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ ఆర్జిత సేవోత్సవాలు ఆరంభమయ్యాయి. పాతగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న భక్తులు సేవోత్సవాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగా స్వామిని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి దర్శించుకున్నారు.  ముఖమండపంలో ఉత్సమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం జరిపారు. 


ప్రాకార మండపంలో కోటి కుంకుమార్చనలు

యాదాద్రీశుడి సన్నిధిలో ఆలయ అష్టభుజి ఈశాన్య ప్రాకార మండపంలో మహాలక్ష్మి అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు నిత్య పూ జలు నిర్వహించారు. అర్చకులు, రుత్వికబృందం అమ్మవారి సహస్రనామ పఠనాలతో కోటి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. కుంకుమార్చన పూజల్లో పాల్గొన్న మహిళా భక్తులకు అర్చకులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, కుంకుమ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.12,76,681 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన కొండకింద వైకుంఠద్వారం చెంత నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్టు దేవస్థాన ఈవో గీతారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

Updated Date - 2022-08-11T05:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising