ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ABN, First Publish Date - 2022-10-28T01:23:07+05:30
విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి అన్నారు.
ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
నల్లగొండ, అక్టోబరు 27: విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం పంచాయతీరాజ్ మినీస్ర్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ, రివర్ నిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో జడ్పీ ఆవరణలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన మాట్లాడుతూ హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన పెద్దులు, టీఆర్‌ఎస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, జడ్పీటీసీలు, పంచాయతీరాజ్ మినీస్ర్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏపాల సత్యనారాయణరెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-28T01:23:10+05:30 IST