ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ABN, First Publish Date - 2022-11-28T01:22:28+05:30

జర్నలిస్టుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఈ సంద ర్భంగా జరిగిన మహాసభలో సైదిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌లోని కౌండిన్య ఫంక్షన్‌ హాల్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ జిల్లా మహాసభలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌, నవంబరు 27: జర్నలిస్టుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఈ సంద ర్భంగా జరిగిన మహాసభలో సైదిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌లోని కౌండిన్య ఫంక్షన్‌ హాల్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ జిల్లా మహాసభలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమా జంలో చైతన్యానికి జర్నలిస్టులు నాంది పలకాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జర్నలిస్టుల సేవలు ఎంతో కీలకమ న్నారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షే మానికి కృషి చేయాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాత్రికేయులు కీలకమైన పాత్రను సోషించారన్నారు. దేశంలో, రాష్ట్రంలో పత్రికలకు స్వేచ్ఛను ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నాయన్నారు. జర్నలి స్టుల సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావి స్తానన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ జర్నలిస్టుల సమ స్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు. జర్న లిస్టులకు ఆరోగ్యశ్రీ కార్డులు, హెల్త్‌ కార్డులు ప్రభుత్వం అందించ డానికి కృషి చేస్తానన్నారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ జర్నలిస్టులకు తనవంతు సహాయసహకారాలు అందిస్తానన్నారు. టీయూడబ్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్క రించాలని కోరగా సానుకూలంగా స్పందించారన్నారు.న్నారు. ఈ సంద ర్భంగా చిన్నారుల భరతనాట్య ప్రదర్శన సభికులను ఆకట్టు కుంది. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యే జ్యోతిప్రజ్వలన చేశారు.

టీయూడబ్ల్యూజే ఐజేయూ అధ్యక్షుడిగా కోల నాగేశ్వరరావు ఎన్నిక

ఈ సందర్భంగా టీయూడబ్యూజే ఐజేయూ అధ్యక్షుడిగా పట్ట ణానికి చెందిన కోల నాగే శ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా సూర్యాపేటకు చెందిన బంటు కృష్ణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మిక్కిలినేని శ్రీనివాస రావు, కరు ణాకర్‌రెడ్డి, కోశాధికారిగా గుంటూరు రాము, ప్రెస్‌ క్లబ్‌ జిల్లా అధ్యక్షుడిగా గింజల అప్పి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌శర్మను ఎన్నుకున్నారు. మిగ తా కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో ఐజే యూ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు కల్లూరి సత్యనారాయణ, చలసాని శ్రీనివాస రావు, మిక్కిలి నేని శ్రీనివాసరావు, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, వక్కవం తుల కోటేశ్వరరావు, నరేందర్‌, టీవీఎల్‌, దయాకర్‌రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివా సాచారి, జానీపాషా, రామనాథం, అంజయ్య, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు సన్మానం

హుజూర్‌నగర్‌ రూరల్‌: కరక్కాయలగూడెం గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేయించడంపై ఆ గ్రామానికి చెందిన రైతులు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సైది రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ముడెం గోపిరెడ్డి, చావా వీరభద్రరావు, సర్పంచ్‌ కీత జయమ్మ ధనమూర్తి, కృష్ణ మోహన్‌, వీరబాబు, నర్సింహారావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పించాలి

హుజూర్‌నగర్‌ రూరల్‌: విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పిం చాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి కోరారు.పట్టణంలోని టౌన్‌హాల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముఖి సైన్స్‌ సంబు రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం వివిధ పోటీలు నిర్వహించారు. కార్యక్ర మంలో అందె సత్యం, ఆంజనేయులు పాల్గొన్నారు.

ఏకాగ్రతతో కొలువులు సాధించాలి

మేళ్లచెర్వు: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్య ర్థులు ఏకాగ్రతతో ఈవెంట్స్‌ సాధన చేసి కొలువులు సాధించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం చింతలపాలెం మండల కేంద్రంలో జైహనుమాన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల మెగా ఈవెంట్‌ గ్రౌండ్‌ టెస్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం గ్రౌండ్‌ టెస్టులో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్ర మంలో ఎంపీపీ వెంకటరెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీనివాసరావు, చింతలపాలెం ఎంపీటీసీ మహత్యం, నక్కగూడెం ఎంపీటీసీ సైదిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ రంగాచారి, మతిన్‌, అమీర్‌సాహెబ్‌, వెంకటరెడ్డి, హనుమాన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ చైర్మన్‌ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T01:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising