ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేదరి కులస్థుల సమస్యల పరిష్కారికి కృషి : చిరుమర్తి

ABN, First Publish Date - 2022-09-19T06:06:19+05:30

రాష్ట్రంలో ఉన్న మేదరి కులస్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే లింగయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండూరు, సెప్టెంబరు 18: రాష్ట్రంలో ఉన్న మేదరి కులస్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. ఆదివారం ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మేదరి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చండూరులో నిర్వహించి న నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడా రు. మేదరి కులస్థులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మేదరి కులస్థులను బీసీ-ఏ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మేదరి కులస్థు ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ కుల, మతాల మధ్యన విద్వేశాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందని ఆరోపించారు. వారికి రానున్న ఉపఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఉప ఎన్నికలో టీఆర్‌ ఎస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేదరి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జొర్రీగల శ్రీనివాస్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన తోకల చంద్రకళవెంకన్న, కౌన్సిలర్‌ కోడి వెంకన్న, నాయకులు నోముల రవి, నరేందర్‌, గణేష్‌, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, వెంకన్న పాల్గొన్నారు.


Updated Date - 2022-09-19T06:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising