ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాలయాల్లో సదుపాయాల కల్పనకు కృషి

ABN, First Publish Date - 2022-05-19T06:41:11+05:30

ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ తెలిపారు.

అదనపు తరగతి గదులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకొండ, మే 18: ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ తెలిపారు. దేవరకొండ ఎంకేఆర్‌ డిగ్రీ కళాశాలలో రూ.1.60కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదుల ను బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఎంకేఆర్‌ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎద గాలన్నారు. దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో గిరిజన డిగ్రీ కళా శాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, వైస్‌చైర్మన్‌ రహత్‌అలీ, ఎంపీపీ జాన్‌ యాదవ్‌, హనుమంతు వెంకటేష్‌గౌడ్‌, టీవీఎన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ రామ రాజు, కౌన్సిలర్‌ సుల్తానా పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని 9వ వార్డులో 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. 12వ వార్డులో ఇటీవల రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లో మృతి చెందిన గాజుల యాదమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. 

Updated Date - 2022-05-19T06:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising