ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరాల నియంత్రణకు కృషి

ABN, First Publish Date - 2022-05-19T06:37:31+05:30

సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీస్‌శాఖ కృషి చే స్తోందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు.

డీజీపీతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి 

సూర్యాపేటక్రైం, మే18: సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీస్‌శాఖ కృషి చే స్తోందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో సైబర్‌నేరాల నియంత్రణపై నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడా రు. సరైన టీమ్‌ను ఏర్పాటుచేసి సాంకేతికంగా సిబ్బందిని చైతన్య పరచాలన్నారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్‌, మైక్రోసాఫ్ట్‌ ఆర్గనైజేషన్‌, ఐటీ కంపెనీలతో కలసి ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇనిస్టిట్యూట్‌ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు. భవిష్యత్‌లో సైబర్‌ నేరాల నియంత్రణకు ఈ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందన్నారు. సైబర్‌ మోసాలకు గురైన బాధితులు వేగంగా ఫిర్యాదు చేయాలన్నారు. అపరిచితులు పంపించే లింక్‌లు, ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లకు స్పందించవద్దన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రితిరాజ్‌, డీసీఆర్‌బీ డీఎస్పీ రెహమాన్‌,సీఐలు శ్రీనివాస్‌, నర్సింహారావు, నాగార్జున, ఎస్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-19T06:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising