ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందేలా కృషిచేయాలి

ABN, First Publish Date - 2022-08-17T06:23:16+05:30

స్వాతం త్య్ర ఉద్యమం చేసిన మహనీయులను స్మరించు కుంటూ భావితరాలకు స్వాతంత్య్ర ఫలాలు అందించేందుకు కృషి చేయాలని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

టగ్‌ఆఫ్‌వార్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ/నల్లగొండ స్పోర్ట్స్‌, ఆగస్టు 16: స్వాతం త్య్ర ఉద్యమం చేసిన మహనీయులను స్మరించు కుంటూ భావితరాలకు స్వాతంత్య్ర ఫలాలు అందించేందుకు కృషి చేయాలని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళ వారం ఉదయం 11:30 గంటలకు జిల్లాకేం ద్రంలోని గడియారం సెంటర్‌లో నిర్వహించిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో మాట్లాడారు. 75ఏళ్ల స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో రెండు వారాల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో పేద లకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, జడ్పీ టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ పాశం రాంరెడ్డి, డీఈఓ భిక్షపతి, మునిసిపల్‌ కమిషనర్‌ కేవీ. రమణాచారి పాల్గొ న్నారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మేకల అభినవ్‌ స్టేడియంలో జిల్లాస్థాయి ఫ్రీడం కప్‌ పోటీలను ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉత్సాహవంతులైన క్రీడాకారులకు పోటీలు నిర్వహించామని, ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వహించిన లాంగ్‌ జంప్‌, వాలీబాల్‌, టగ్‌ఆఫ్‌వార్‌ క్రీడల్లో సుమారు 6,001 మంది పాల్గొన్నారన్నారు. 13,14వ తేదీల్లో కూడా క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో మంగళ, బుధవారాల్లో సుమారు 900 మంది ఈ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కలెక్టర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 22వ వరకు స్వాతంత్య్ర వజ్రోత్సవ కార్య క్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, క్రీడల అధికారి మక్బుల్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T06:23:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising