ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి కృషి

ABN, First Publish Date - 2022-05-17T06:26:37+05:30

పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధానన్యాయమూర్తి బీఎస్‌ జగ్జీవన్‌కుమార్‌ అన్నారు.

మాట్లాడుతున్న ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ , మే 16 : పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధానన్యాయమూర్తి బీఎస్‌ జగ్జీవన్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని కోర్టు భవన సముదాయాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయమూర్తులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 86,501 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. హుజూర్‌నగర్‌లో ఏడీఏ,  ఏడీఏం కోర్టుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవవందనం స్వీకరించారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గజమాల, శాలువాతో సన్మానించారు.కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి, కార్యదర్శి జక్కుల నాగేశ్వరరావు, నారపరాజు శ్రీనివాసరావు, ఏజీపీ గోపాలకృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T06:26:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising