ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దశల వారీగా గ్రామాల అభివృద్ధికి కృషి

ABN, First Publish Date - 2022-01-29T07:00:55+05:30

దశల వారీగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపీ ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు(ఎం), జనవరి 28: దశల వారీగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మొరిపిరాల నుంచి రేగులకుంట వరకు రూ.2.34 కోట్ల పీఎంజీఎ్‌సవై నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి రేగులకుంటలో పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆత్మకూరు నుంచి ముస్త్యాలపల్లి వరకు అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేయిస్తానని తెలిపారు. కొండాపురం - కాల్వపల్లి  గ్రామాల మధ్య బిక్కేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అంచనా వేయిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నానని తెలిపారు.  నిధుల కోసం కేంద్రంలో మంత్రులను గాని, అధికారులనుగాని కలవడానికి వెళితే కరోనాతో అధికారుల కార్యాలయాలు సగం మూసివేసి ఉంటున్నాయన్నారు. అనంతరం తమను విధుల్లోకి తీసుకోవాలని మండల ఫీల్డు అసిస్టెంట్లు ఎంపీ, ఎమ్మెల్మేలకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కె.నరేందర్‌,  సర్పంచులు కె.సత్తయ్య, ఎస్‌.తిర్మల్‌రెడ్డి, ఎం.లలిత, తహసీల్దార్‌ ఎం.జయమ్మ, ఎంపీడీవో ఏ.రాములు, ఆలేరు మార్కెట్‌ చైర్మన రవీందర్‌గౌడ్‌, డీఈ హేమంతకుమార్‌, ఏఈ సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T07:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising