ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునుగోడు అభివృద్ధికోసమే రాజీనామా

ABN, First Publish Date - 2022-08-11T05:57:28+05:30

మునుగోడు అభివృద్ధికోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవా రం మండలకేంద్రంలో ఆయ న విలేకరులతో మాట్లాడు తూ మునుగోడు ఉప ఎన్నికలో తనను గెలిపించి, కేసీఆర్‌ నియంతపాలనకు చరమగీతం పాడాలన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసీఆర్‌ నియంత పాలనకు చరమగీతం : మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి 

మర్రిగూడ, ఆగస్టు 10: మునుగోడు అభివృద్ధికోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవా రం మండలకేంద్రంలో ఆయ న విలేకరులతో మాట్లాడు తూ మునుగోడు ఉప ఎన్నికలో తనను గెలిపించి, కేసీఆర్‌ నియంతపాలనకు చరమగీతం పాడాలన్నారు. మునుగోడు ప్రజలు తనకు దేవుళ్లని, వారి కోసమే పదవిని త్యాగం చేశానని చెప్పారు. తన రాజీనామా అనంతరమే మునుగోడుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులు మంజూరు చేస్తారని చెప్పారు. ఈనెల 21న బీజేపీలో చేరుతున్నానని,బీజేపీలో చేరాలని ఎవరినీ బలవంతం చేయడంలేదన్నారు.  

ఉప పోరుకు భూనిర్వాసితులు సిద్ధం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అనంతరం ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు నిర్వాసితులు సిద్ధమవుతున్నారు. మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్‌, చింతపల్లి మండలంలోని కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న భూనిర్వాసితులు ఉపఎన్నిక బరిలో నిలిచేందుకు బుధవారం మండలంలోని చర్లగూడెం గ్రామంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడారు. రెండు రిజర్వాయర్ల పరిధిలోని ముంపు గ్రామాల నుంచి 1800 బరిలో నిలుస్తామన్నారు. 

Updated Date - 2022-08-11T05:57:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising