ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునుగోడు అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం

ABN, First Publish Date - 2022-10-28T01:20:48+05:30

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతోనే సాధ్యమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మం డలం లక్ష్మణాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకు లు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో గురువారం టీఆర్‌ఎ్‌సలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి

నల్లగొండ జిల్లా నాంపల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీలో పలువురి చేరిక

దేవరకొండ, అక్టోబరు 27: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతోనే సాధ్యమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మం డలం లక్ష్మణాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకు లు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో గురువారం టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ ము నుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం గ్యాస్‌ ధరలను విఫరీతంగా పెంచుతుండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం వచ్చే బీజేపీ నేతలను గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఎందుకు పెంచారో నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందాయని, మునుగోడు నియోజకవర్గంలో ప్లోరైడ్‌ సమస్యను మిషన్‌భగీరథ ద్వారా పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌, నాంపల్లి మండల రైతుబంధు అధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, నాయకులు రమేష్‌, నగేష్‌, అంజయ్య, మామిడి వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-10-28T01:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising