ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తక్షణమే డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2022-09-28T05:18:13+05:30

యాదగిరిగుట్ట, ఆలేరు మునిసిపాలిటీలో తక్షణమే డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.

గుట్టలో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట రూరల్‌, సెప్టెంబరు 27: యాదగిరిగుట్ట, ఆలేరు మునిసిపాలిటీలో తక్షణమే డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం యాదగిరిగుట్టలో ఆలేరు, యాదగిరిగుట్ట, మునిసిపల్‌ పాలకవర్గాలు, అధికారులకు పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్త సేకరణపై అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెత్త సేకరణలో ముందున్నప్పటికీ డంపింగ్‌యా ర్డు లేకపోవడం ఇబ్బందిగా ఉందని, వెంటనే డంపింగ్‌ యార్డుల నిర్మాణం చేపట్టాలన్నారు. యాదగిరిగుట్టకు ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు, వీఐపీలు వచ్చివెళ్తారని, ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ పరిశుభ్రంగా ఉంటేనే అభినందిస్తారన్నారు. సెగ్రిగేషన్‌ యార్డు నిర్మాణాలు చేపట్టకపోతే వాటికి మంజూరైన నిధులు వృథా కాకుండా వేరే పనులకు వినియోగించాలన్నారు. యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్తను ఏ విధంగా సేకరించాలనే అంశంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ము  నిసిపల్‌ చైర్‌పర్సన్లు ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, వస్పరి శంకరయ్య, కమిషనర్లు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మారుతీ ప్రసాద్‌, ఏఈలు, యాదగిరిగుట్ట, ఆలేరు మునిసిపల్‌ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కనధారావు, వాసంలు డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు మల్లాపురంలో స్థలాన్ని పరిశీలించారు.  

Updated Date - 2022-09-28T05:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising