ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణాల మంజూరులో జాప్యం చూపొద్దు : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-03-05T06:40:19+05:30

లబ్ధిదారులకు రుణాల మంజూరులో జాప్యం చేయవద్దని బ్యాంకు అధికారులను కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), మార్చి 4: లబ్ధిదారులకు రుణాల మంజూరులో జాప్యం చేయవద్దని బ్యాంకు అధికారులను కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. బ్యాంక్‌ అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 85శాతం రుణాలు వివిధ బ్యాంకుల ద్వారా అందించామన్నారు. బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలకు సంబంధించిన రుణాల మంజూరు తక్కువగా ఉందని దీనిపై దృష్టిసారించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంద ని, అదే దిశగా రుణాలు మంజూరు చేయాలన్నారు. రైతులు, నిరుద్యోగ యువతకు రాయితీ నిధులు విడుదల చేసి వెంటనే రుణాలిచ్చి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1935.57కోట్ల పంట రుణ లక్ష్యానికి రూ.1380.17కోట్లు ఇచ్చామన్నారు. వ్యవసాయ టర్మ్‌ రుణాలు రూ.8 50.68కోట్లకు రూ.318.9కోట్లు, చిన్నతరహా పరిశ్రమలకు రూ.381.18కోట్ల లక్ష్యానికి రూ.310.22కోట్లు ఇచ్చామన్నారు. విద్య రుణాలు రూ.71.99కోట్లకు ఇప్పటి వరకు రూ.66.46కోట్టు, గృహ రుణాలు రూ.98.89కోట్లకు రూ.186.50కోట్లు, స్వ యం సహాయ సంఘాలకు రూ.408.09కోట్లకు రూ.523.48కోట్ల ఇచ్చామన్నారు. మిగతా ప్రాధాన్య రంగాలకు రూ.102.62కోట్ల లక్ష్యానికి రూ.158.31కోట్లు, వ్యా పార రుణాలు రూ.298.56కోట్లకు రూ.576.14కోట్లు లబ్ధిదారులకు అందించామన్నారు. రుణ బకాయిల వసూలుకు బ్యాంకర్లకు ఆయా శాఖల అధికారులు సహకరించాలన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం జగదీ్‌షచంద్రబోస్‌, డీఏవో రామారావునాయక్‌, ఏజీఎం సత్యనారాయణ, తేజాదీప్తి, సంక్షేమ అధికారులు శంకర్‌, శిరీష, అనసూర్య, దయానందరాణి, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising