ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరి జాలాల పేరుతో అయోమయానికి గురి చేయొద్దు

ABN, First Publish Date - 2022-03-05T06:20:56+05:30

గోదావరి జలాల పేరుతో ప్రజలను రైతాంగాన్ని అయోమయానికి గురి చేయొద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ తెలిపారు.

మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 వలిగొండ, మార్చి 4:
గోదావరి జలాల పేరుతో ప్రజలను రైతాంగాన్ని అయోమయానికి గురి చేయొద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ తెలిపారు. మండల కేంద్రంలో పార్టీ ముఖ్యనాయకుతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 20ఏళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తి చేయని బునాది గాని కాల్వద్వారా గోదావరి జలాలు తీసుకువస్తామని, దానికి సీఎం అంగీకరించారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రకటించడం సరైంది కాదని అన్నారు. బునాది గాని కాల్వను ఎప్పుడు పూర్తి చేస్తారో గడువును ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బునాదిగాని కాల్వ నిర్మాణం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ఆరు మండలాలకు సుమారుగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాల్వ నేటికి పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో బునాదిగాని కాల్వ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, నాయకులు కూర శ్రీనివాస్‌, లింగం, సురేష్‌, నర్సింహ, తిరుమలరెడ్డి, నాగరాజు, స్వామి, రామలింగం, మురళికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising