ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబుల్‌బెడ్‌రూం ఇళ్లకోసం దివ్యాంగుల పోరాటం

ABN, First Publish Date - 2022-05-17T06:33:03+05:30

డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో ఐదు శాతం కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ వాటిని ఆక్రమించుకునేందుకు వెళుతున్న దివ్యాంగులను పోలీసులు అరెస్టు చేయటంతో భువనగిరిలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది.

డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వద్దకు ర్యాలీగా వెళ్తున్న దివ్యాంగులను అడ్డుకుంటున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇళ్లను ఆక్రమించుకునేందుకు యత్నం

పలువురి అరెస్ట్‌


భువనగిరి టౌన్‌, మే 16: డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో ఐదు శాతం కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ వాటిని ఆక్రమించుకునేందుకు వెళుతున్న దివ్యాంగులను పోలీసులు అరెస్టు చేయటంతో భువనగిరిలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తలు వారి ఆందోళన కు మద్దతు తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని, భువనగిరిలో వృథాగా ఉన్న ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలనే డిమాండ్‌తో దివ్యాంగుల హ క్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ)ఆధ్వర్యంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ను ఆక్రమించుకునేందుకు యత్నించారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడవయ్య, జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్‌ ఆధ్వర్యంలో డబు ల్‌ బెడ్‌ రూం ఇళ్ల వద్దకు ర్యాలీగా వెళ్తున్న సుమారు 50 మంది దివ్యాంగులను పోలీసులు మూడు దఫాలుగా అరెస్ట్‌ చేసి, స్థానిక పట్టణ, రూర ల్‌ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. వారికి మద్దతు తెలిపిన బీజేపీ, కాం గ్రెస్‌, సీపీఎం కార్యకర్తలను కూడా పోలీసులు అరె్‌స్టచేసి వేర్వేరు పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. అనంతరం దివ్యాంగులను, బీజే కార్యకర్తలను పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, పోలీస్‌ స్టేషన్‌లో పరామర్శించారు. దివ్యాంగులను, వారికి మద్దతు తెలిపిన వారిని సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు.

Updated Date - 2022-05-17T06:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising