ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం పంపిణీ చేయండి

ABN, First Publish Date - 2022-06-28T06:36:04+05:30

చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు నిర్వాసితుల కు పరిహారం చెక్కులు పంపిణీ చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 40 రోజుల ధర్నా అనంతరం ప్రభుత్వం స్పందించి నిర్వాసితులకు చెక్కులు మం జూరు చేసిందని, ఆ చెక్కులను అధికారులు పంపిణీ చేయకుండా మూడు రోజుల నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న చర్లగూడెం నిర్వాసితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వాసితుల ఆందోళన

మర్రిగూడ, జూన్‌ 27 : చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు నిర్వాసితుల కు పరిహారం చెక్కులు పంపిణీ చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 40 రోజుల ధర్నా అనంతరం ప్రభుత్వం స్పందించి నిర్వాసితులకు చెక్కులు మం జూరు చేసిందని, ఆ చెక్కులను అధికారులు పంపిణీ చేయకుండా మూడు రోజుల నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇళ్ల విస్తీర్ణం, ఇంటి ఆవరణలోని చెట్లు, తదితర వాటిని బట్టి పరిహారం అందజేయాల్సి ఉన్నా; కొందరికి తక్కువ, మరికొందరికీ ఎక్కువ పరిహారం వచ్చిన ట్లు తెలిపారు. ఇటీవల అధికారులు గ్రామంలో ఇళ్ల సర్వే చేసి బీఎల్‌ఐఎస్‌ నెంబర్లు కేటాయించి, ప్రతిపాదనలు తప్పుగా పంపించారని అన్నారు. దీంతో అసలైన నిర్వాసితులకు అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. చర్లగూడెంలో 213 గృహాలకు చెక్కులు మంజూరైనా మూడు రోజుల నుంచి కేవ లం 170 గృహాలకు మాత్రమే పంపిణీ చేశారని అన్నారు. సోమవారం మరో 28 గృహాలకు ఆర్డీవో కార్యాలయంలో పంపిణీ చేస్తామని తహసీల్దార్‌ సంఘమిత్ర తెలిపారని బాధితులు వెల్లడించారు. 213 గృహలకు తహసీల్దార్‌ కార్యాలయంలోనే చెక్కులు పంపిణీ చేయకుండా ఆర్డీవో కార్యాలయానికి ఎం దుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ఆందోళన విషయంపై తహసీల్దార్‌ సంఘమిత్ర వివరణ ఇస్తూ 213 గృహాలను పరిహారానికి ఎంపిక చేశామని, ఇప్పటివరకు 170 గృహాలకు పంపిణీ చేశామన్నారు. మరో 28 లబ్ధిదారులకు ఆర్డీవో కార్యాలయంలో చె క్కులు అందజేస్తామని తెలిపారు. అయితే 25 గృహాలకు చెక్కులు మంజూరు కాలేదని, అనుమానంగా ఉన్నందున వాటిని నిలిపివేశామని అన్నారు. త్వరలో వారికి అందజేస్తామన్నారు.


తప్పుడు సర్వేతో పరిహారం అందలేదు : డేరింగుల లక్ష్మమ్మ, చర్లగూడెం నిర్వాసితురాలు

అధికారులు ఇంటింటి సర్వే చేసినా పరిహారం సక్రమం గా అందలేదు. అధికారులు తప్పుడు తడకల సర్వే చేయడం వల్ల పూర్తిస్థాయిలో పరిహారం అందుకోలేక పోతున్నా. తిరిగి సర్వే చేసి న్యాయం చేయాలి.


అధికారులు సక్రమంగా సర్వే నిర్వహించారు : గోపీరాం, ఆర్డీవో, దేవరకొండ 

ఇంటింటి పరిహారం చెల్లించడంలో ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగలేదు. అధికారులు ఇల్లిళ్లు తిరుగుతూ డీఎల్‌ఐఎస్‌ నెంబర్‌లు వేశారు. సర్వేలో తప్పులు జరగలేదు. ప్రతి ఒక్క నిర్వాసితులకు న్యాయపరంగా పరిహారం చెల్లిస్తున్నాం. ఎవరికైనా తక్కువ పరిహారం వస్తే దరఖాస్తు చేసుకోవాలి.


Updated Date - 2022-06-28T06:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising