ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా బియ్యం సరఫరా

ABN, First Publish Date - 2022-07-06T06:32:22+05:30

అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యాన్ని నేరుగా రవాణా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరాపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పమేలాసత్పథి

యాదాద్రి, జూలై 5(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యాన్ని నేరుగా రవాణా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరాపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 901 అంగన్‌వాడీ కేంద్రాలకు గతంలో బియ్యం సరఫరా చౌకధరల దుకాణాల ద్వారా జరిగిందని, ఆ ప్రక్రియలో సమస్యలు తలెత్తుతున్న దృష్ట్యా నేరుగా స్టేజ్‌-2 రవాణా కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అందుకనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో అంగన్‌వాడీలకు బియ్యాన్ని అందించాలన్నారు. సరుకుల రవాణాలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం అందించాలన్నారు. గర్భిణులు నాణ్యమైన ఆహారం తీసుకొని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ ఎం.గోపికృష్ణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి చంద్రకళ, పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T06:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising