ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ది పనులను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-12-30T00:47:31+05:30

పట్టణంలో రహదారుల విస్తరణ, సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి గురువారం కలెక్టర్‌ తన చాంబర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, డిసెంబరు 29: పట్టణంలో రహదారుల విస్తరణ, సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి గురువారం కలెక్టర్‌ తన చాంబర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ గత ఏడాది జిల్లా కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి పనులు మంజూరు చేయడమేగాక పట్టణ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారన్నారు. ఆయన ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి, సందరీకరణ పనులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, కమిషనర్‌ కేవీ.రమణాచారి, మునిసిపల్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించాలి

వినియోగదారుల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల రక్షణచట్టం-2019 ద్వారా కల్పించిన హక్కులను ప్రజలకు వివరించాలన్నారు. వినియోగదారుడు నష్టపోయినట్టు భావిస్తే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వెంకటేశ్వర్లు, వినియోగదారుల కమిషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising