ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవరకొండ అక్రమాల కేసు సీబీసీఐడీ నుంచి ఏసీబీకి!

ABN, First Publish Date - 2022-10-10T05:50:27+05:30

దేవరకొండ డివిజన్‌ సహకార బ్యాంకులో అక్రమాలు చోటుచేసుకొని తొమ్మిదిన్నరేళ్లవుతున్నా ఈ కేసు ఎటూ తేలలేదు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించగా, విచారణలో జాప్యం కారణంగా దీన్ని ఏసీబీ కి బదలాయించాలని డీసీసీబీ యంత్రాంగం హైకోర్టును ఆశ్రయించింది.

నల్లగొండ జిల్లా దేవరకొండ సహకార బ్యాంకు కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టును ఆశ్రయించిన డీసీసీబీ యంత్రాంగం

ఏ క్షణమైనా తీర్పు వెలువడే అవకాశం



నల్లగొండ, అక్టోబరు 9: దేవరకొండ డివిజన్‌ సహకార బ్యాంకులో అక్రమాలు చోటుచేసుకొని తొమ్మిదిన్నరేళ్లవుతున్నా ఈ కేసు ఎటూ తేలలేదు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించగా, విచారణలో జాప్యం కారణంగా దీన్ని ఏసీబీ కి బదలాయించాలని డీసీసీబీ యంత్రాంగం హైకోర్టును ఆశ్రయించింది. దీని పై హైకోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. దేవరకొండ సహకార బ్యాంకులో రూ.18కోట్లమేర అక్రమాలు జరిగాయని తొలుత భావించగా అధికారులు మా త్రం రూ.9.65కోట్లుగా తేల్చారు. తాజాగా రూ.30కోట్లకు పైగా స్వాహా అయిన ట్టు వెలుగులోకి వచ్చింది. దీంట్లో 150 మందికి పైగా పాత్రధారులు ఉన్నట్టు తేలింది. అందులో సహకార బ్యాంకు అఽధికారులు, ఉద్యోగులతో పాటు ప్రైవే టు వ్యక్తులు ఉన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నిధులు స్వాహా అయినట్లు వెలుగుచూసింది. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. అందులో కొందరు ట్రిబ్యునల్‌, కోర్టులను ఆశ్రయించడంతో కేసు విచారణ ఆలస్యమైంది.  ట్రిబ్యునల్‌ ఆ టంకాలు తొలిగాక నిందితులైన 150 మందిని పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకుంటారని చర్చ సాగింది. అయితే ఇప్పటి వరకు 32 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. దేవరకొండ బ్యాంకు పరిధిలోని దేవరకొండ, తి మ్మాపూర్‌, కొండమల్లేపల్లి, చిత్రియాల పీఏసీఎ్‌సలో అక్రమాలు జరిగినట్లు తొ లుత గుర్తించిన అధికారులు అప్పట్లో జిల్లా సహకారశాఖ భాగస్వామ్యంతో 51 సెక్షన్‌ ద్వారా విచారణ చేశారు. డోర్‌టూడోర్‌ సర్వే నిర్వహించి తీసుకున్న రు ణాలపై ఆరా తీశారు. ఆ తరువాత పలు రాజకీయ అడ్డంకులతో ఈ కేసు ముందుకు సాగలేదు. లోకాయుక్త సైతం ఈ కేసును విచారించినా ఎటూ తేలలేదు. డీసీసీబీ గత పాలకవర్గం ఐదుగురు డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటుచేసి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలని నిర్ణయించినా ఆ కమిటీ నీరుగారింది.

ఎటూ తేల్చని సీబీసీఐడీ

దేవరకొండ సహకార బ్యాంకు కేసు విషయంలో కొద్ది రోజుల క్రితం దేవరకొండలో ఇద్దరిని, పీఏపల్లిలో ఒకరిని సీబీసీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సీబీసీఐడీలో సిబ్బంది కొరత, కేసులు అధికంగా ఉండటంతో ఈ కేసు విచారణలో జాప్యం చోటుచేసుకుంది. వాస్తవానికి ఈ కేసు విచారణ నిర్వహించాల్సిందిగా గత పాలకవర్గం సీబీసీఐడీకి అప్పగించాలని ప్రభుత్వానికి లేఖ రాసినా, రాజకీయ కారణాలు, సాంకేతిక సమస్యలతో అది నిలిచింది. ఆ తర్వాత వచ్చిన పాలకవర్గం కేసును సీబీసీఐడీకి అప్పగించినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో సీబీసీఐడీ నుంచి కేసును ఏసీబీకి బదలాయించాలని డీసీసీబీ యంత్రాంగం హైకోర్టును ఆశ్రయించింది. ఏ క్షణమైనా తీర్పు వెలువడే అవకాశం ఉండగా, ఏసీబీకి కేసును బదలాయిస్తే విచారణ వేగవంతం అవుతుందని డీసీసీబీ భావిస్తోంది. ఈ విషయమై డీసీసీబీ సీఈవో మదన్‌మోహన్‌ను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా హైకోర్టు ఆదేశాలు వస్తే కేసును ఏసీబీకి బదలాయిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-10-10T05:50:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising