ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోమల నివారణతోనే డెంగ్యూ నిర్మూలన: డీఎంహెచ్‌వో

ABN, First Publish Date - 2022-05-17T06:25:08+05:30

దోమల నివారణతోనే డెంగ్యూ నిర్మూలన సాధ్యమని, ప్రజలు డెంగ్యూ నిర్మూలనకు సహకరించాలని డీఎంహెచ్‌వో కోట చలం అన్నారు.

సూర్యాపేట సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో కోట చలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటటౌన్‌ / గరిడేపల్లి రూరల్‌ / అనంతగిరి/ చిలుకూరు / ఆత్మకూర్‌(ఎస్‌) / మఠంపల్లి,  మే 16 : దోమల నివారణతోనే డెంగ్యూ నిర్మూలన సాధ్యమని, ప్రజలు డెంగ్యూ నిర్మూలనకు సహకరించాలని డీఎంహెచ్‌వో కోట చలం అన్నారు. జాతీయ డెంగ్యూ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశఽంలో ఆయన మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు వృద్ధి చెందవన్నారు. డెంగ్యూ వ్యాధి నివారణకు కృషి చేసిన హెల్త్‌ అసిస్టెంట్‌ కడారి రమేష్‌, అనిత, డాక్టర్‌ ప్రమోద్‌, శ్రీనివాస్‌, సరితలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.  గరిడేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో డాక్టర్‌ ఆరీఫ్‌, పీహెచ్‌ ప్రమీల పాల్గొన్నారు. అనంతగిరి మండలం త్రిపురారంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డాక్టర్‌ కృష్ణవేణి, కళావతి పాల్గొన్నారు. చిలుకూరులో నిర్వహించిన ర్యాలీలో సర్పంచ్‌ కొడారు బాబు, వైద్యాధికారి సుశీల, సీహెచ్‌వో వినోద్‌ పాల్గొన్నారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మఠంపల్లిలో డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఫీరోజ్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T06:25:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising