ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజాస్వామ్యానికి మనుగడ

ABN, First Publish Date - 2022-05-20T06:44:15+05:30

:దేశంలో కమ్యూనిస్టు ఉద్య మాలు బలపడితేనే ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు.

చౌటుప్పల్‌లో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌,  మే 19:దేశంలో కమ్యూనిస్టు ఉద్య మాలు బలపడితేనే ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు.  సీపీఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు ఆ పార్టీ నాయకులు నివాళులర్పిం చారు. చౌటుప్పల్‌లో సీపీఎం మునిసిపల్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సుందరయ్య చిత్రపటానికి ఆయన నివాళులర్పించి మాట్లా డారు. ఈ దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత  సుందరయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడని అన్నారు. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి వెన్ను దన్నుగా సుంద రయ్య నిలిచారని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై భారం మోపుతోందని మతోన్మాద రాజకీయాలతో దేశంలో అశాంతి పెంచేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. మతోన్మాద శక్తులను ఎదుర్కోవడా నికి పార్టీ శ్రేణులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనం తరం స్థానిక ప్రభుత్వ ఆసుప త్రిలో పండ్లు, బ్రెడ్‌ ప్యాకెట్లు పంచారు. కార్య క్రమంలో సీపీఎం మునిసిపల్‌ కార్యదర్శి బండారు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా,  మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, నాయకులు బూర్గు కృష్ణారెడ్డి, మునిసిపల్‌  వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలం, గోశిక కరుణా కర్‌, ఎండీ ఖయూం,  బత్తుల దాసు, కె.సుందరయ్య, అంతటి అశోక్‌, బోయ యాదయ్య, చెన్నబోయిన వెంకటేష్‌, మాదార్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-20T06:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising