దాశరథి రచనలు అస్థిత్వ ఉద్యమాలకు దిక్సూచి
ABN, First Publish Date - 2022-07-23T05:26:55+05:30
దాశరథి రచనలు అస్థిత్వ ఉద్యమాల కు దిక్చూచి అని తెలంగాణ కవుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుతారపు వెంకటనారాయణ అన్నారు. దాశరథి కృష్ణమాచార్య 98వ జయంతి సం దర్భంగా భువనగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలు గు సాహిత్యానికి దాశరథి అందించిన సేవలు, చూపిన నూతన మారా ్గలు అద్వితీయమన్నారు.
తెలంగాణ కవుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటనారాయణ
భువనగిరి టౌన్, జూలై 22: దాశరథి రచనలు అస్థిత్వ ఉద్యమాల కు దిక్చూచి అని తెలంగాణ కవుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుతారపు వెంకటనారాయణ అన్నారు. దాశరథి కృష్ణమాచార్య 98వ జయంతి సం దర్భంగా భువనగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలు గు సాహిత్యానికి దాశరథి అందించిన సేవలు, చూపిన నూతన మారా ్గలు అద్వితీయమన్నారు. తెలంగాణ సాహిత్యంలో ఆయన మిన్న అని, ఆయన రచనలు తెలంగాణ ఉద్యమానికి దోహదపడ్డాయన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ పోత్నక్ ప్రమోద్‌కుమార్, కాచరాజు జయప్రకాశ్‌రావు, దంతరబోయిన దైవాదీనం, భట్టు రాంచంద్ర య్య, ప్రవీణ్‌కుమార్, పాదరాజు, శ్రీనివాస్, వెంకటేష్ పాల్గొన్నారు.
ఉద్యమశిఖరం దాశరథి
రామన్నపేట/ మోత్కూరు: నిజాం చెర నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందేందుకు జరిగిన ఉద్యమంలో దాశరథి కృష్ణమాచార్య పెన్ను, గన్ను పట్టి పోరాడిన ఉద్యమశిఖరమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యుడు బెల్లి యాదయ్య అన్నారు. దాశరథి జయంతి సందర్భంగా రామన్నపేట డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ యన మాట్లాడారు. అదేవిధంగా మోత్కూరు గ్రంథాలయంలో దాశరథి చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమా ల్లో డిగ్రీకళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివా్‌సరెడ్డి, ఇన్‌చార్జి లైబ్రేరియన్ కాంతయ్య, ఏవో మంజర్ జాఫ్రి, అధ్యాపకులు, మోత్కూరులో గ్రంథాల య చైర్మన్ కోమటి మత్స్యగిరి, బయ్యని రాజు, దొంతోజు శ్రీనివాస్, సజ్జ నం మనోహర్, కోటమర్తి ప్రవీణ్, బాబుచారి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-23T05:26:55+05:30 IST