ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటల బీమా అమలుచేయాలి

ABN, First Publish Date - 2022-07-04T06:27:43+05:30

కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలని ఏఐకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న పశ్య పద్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఐకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ

హుజూర్‌నగర్‌, జూలై 3: కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలని ఏఐకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య డిమాండ్‌ చేశారు. మూడు రోజులుగా పట్టణంలో నిర్వహించిన సంఘం రాష్ట్ర మహాసభలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులను పాలకవర్గాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. కేంద్రం పథకాలను సీఎం కేసీఆర్‌ అమలుచేయడం లేదన్నారు. దీంతో ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంట నష్టపోతున్నారని, కనీసం వీరిని ఆదుకోవడంలో కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ శాస్త్రవేత్త కిలార్‌, జన్యుశాస్త్రవేత్తలు మర్లసోమ, రమణమూర్తి తదితరులు పంటల బీమా పథకంపై మహాసభలో చర్చించారు. కార్యక్రమంలో నాయకులు దొడ్డా నారాయణరావు, గుర్రం యాదగిరిరావు, గన్నా చంద్రశేఖర్‌, పశ్య కన్నమ్మ, కోప్పోజు సూర్యానారాయణ, బొమ్మగాని ప్రసాద్‌, కంబాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T06:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising