ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు : సీఐ

ABN, First Publish Date - 2022-05-27T06:30:58+05:30

ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేసినా, రైతులకు విక్రయించినా క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామ

సూర్యాపేట ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న వ్యవసాయ, పోలీస్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట సిటీ / మేళ్లచెర్వు / చింతలపాలెం, మే 26 :  ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేసినా, రైతులకు విక్రయించినా క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామని సూర్యాపేట పట్టణ సీఐ ఆంజనేయులు హెచ్చరించారు. సూర్యాపేట పాత వ్యవసాయమార్కెట్‌లోని ఫర్టిలేజర్‌ దుకాణాల్లో కొత్తగా వచ్చిన పత్తి విత్తనాల ప్యాకెట్లను గురువారం పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఏవో షేక్‌ జానీమియాతో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల నాణ్యతలపై విధించిన నిబంధనలు డీలర్లు, షాపు యజమానులు ఖచ్చితంగా పాటించాలన్నారు. పంటకాలం పూర్తయ్యే వరకూ రైతులు విత్తన ప్యాకెట్లను భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ కృష్ణ, కరుణాకర్‌, శ్రీనివాసచారి, రమేష్‌, డీలర్లు రామకృష్ణ, ఉప్పల రవి, ఉప్పల రమేష్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా మేళ్లచెర్వు మండల కేంద్రంలోని విత్తన విక్రయ దుకాణాలను వ్యవసాయ, పోలీసు అధికారులు తనిఖీచేశారు. నకిలీ, కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్సు కలిగిన డీలర్లు, దుకాణాల వద్దే విత్తనాలను కొనుగోలు చేయాలని వారు సూచించారు. తనిఖీల్లో ఎస్‌ఐ సురే్‌షకుమార్‌, ఏవో శ్రీనివాస్‌ గౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు. చింతలపాలెం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఎస్‌ఐ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని చూచించారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T06:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising