ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెర్వుగట్టులో అవినీతిని అరికట్టాలి

ABN, First Publish Date - 2022-04-18T06:22:25+05:30

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు రామలింగేశ్వర ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్‌కురుమ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌ 

నార్కట్‌పల్లి, ఏప్రిల్‌ 17: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు రామలింగేశ్వర ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్‌కురుమ డిమాండ్‌ చేశారు. ఆలయంలోని ఈవో కార్యాలయం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తలనీలాల టెండర్‌ గడువు కాలం ముగిసినా దానిని నిబంధనలకు విరుద్ధంగా పొడిగించారని, టెండర్‌ను ఆంధ్రా వాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు. ఆలయంలో కొంతమంది అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారనీ, ఆలయ భూమి కౌలు విషయంలో నిబంధనలు పాటించలేదనీ ఆరోపించారు. అలాగే లడ్డూ ప్రసాదంలో నాణ్యత పాటించడం లేదన్నారు. ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఈ నెల 25 నుండి ఆమరణదీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ గండిచెర్వు వెంకన్నగౌడ్‌, ఉపాధ్యాక్షుడు బూడిద మల్లిఖార్జున, పానుగంటి విజయ్‌గౌడ్‌, నాయకులు గూడూరు భాస్కర్‌, నర్సింహ్మ, ఊయ్యాల రామకృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2022-04-18T06:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising