ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం

ABN, First Publish Date - 2022-01-29T06:33:07+05:30

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు కార్పొరేట్‌ వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు.

ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి 

 ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు

మిర్యాలగూడ, జనవరి 28: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు కార్పొరేట్‌ వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు. స్థానిక ఏరియా అసుపత్రిని మెడికల్‌ ఈఈ అజీజ్‌, డీఈ లోకిలాల్‌, డీసీహెచ్‌ఎ్‌స మాతృనాయక్‌లతో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలోని రోగులు, గర్భిణులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వార్డుల్లో పర్యటించి వసతుల నిర్వహణపై ఆరా తీశారు. ఆపరేషన్‌ గదుల్లో అవసరమైన ఎక్విప్‌మెంట్‌కు సంబంధించి విధుల్లోని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా మంజూరైన 30 పడకలను పరిశీలించారు. ఆసుపత్రి అభివృద్ధికోసం ప్రస్తుతం రూ.74 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. సీటీ స్కానింగ్‌ విభాగాన్ని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో రోగులకు అసౌకర్యం కలగకుండా, విద్యుత్‌ సేవలకు అంతరాయం కలగకుండా 100 కేవీ సామర్థ్యం కల ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలో 150 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం అమర్చినట్లు తెలిపారు. వారివెంట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ సమరధ్‌, వైద్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-29T06:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising