ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయం

ABN, First Publish Date - 2022-07-07T05:30:46+05:30

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

కోదాడ, జూలై 6 : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ హయాంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నాయకులు విస్మరించారని ఆరోపించారు. రైతులకు ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ ఇంతవరకూ చేయలేదన్నారు. దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారం లోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఎనిమిదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు, రైతులు, నిరుద్యోగులతో పాటు అన్నివర్గాల వారికి అసంతృప్తి నెలకొందని,  రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే గ్రామాల్లో రోజురోజుకీ కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన వారంతా తిరిగి కాంగ్రె్‌సలోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో రాబోవు ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పెద్దఎత్తున వలసలు ఉంటాయని ఆయన అన్నారు. కార్యక్రమానికి సింగిల్‌విండో వైస్‌చైర్మన్‌ సుభా్‌షరెడ్డి అధ్యక్షత వహించగా, మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, పార్టీ నాయకులు అల్సకాని లక్ష్మీనారాయణరెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, సీతారాంరెడ్డి, రామారావుతో పాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising