ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్యూనిస్ట్‌నేత వెంకటనరసింహారెడ్డి మృతి

ABN, First Publish Date - 2022-07-04T06:25:41+05:30

సాయుధ పోరాట యోధుడు, తొలితరం కమ్యూనిస్ట్‌ నేత, న్యూడెమొక్రసీ సీనియర్‌ నేత ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మల పెన్‌పహాడ్‌కు చెందిన అలుగుబెల్లి వెంకటనరసింహారెడ్డి(97) ఆదివారం మృతి చెందారు.

నరసింహారెడ్డి(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూర్‌(ఎస్‌), జూలై 3: సాయుధ పోరాట యోధుడు, తొలితరం కమ్యూనిస్ట్‌  నేత, న్యూడెమొక్రసీ సీనియర్‌ నేత ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మల పెన్‌పహాడ్‌కు చెందిన అలుగుబెల్లి వెంకటనరసింహారెడ్డి(97) ఆదివారం మృతి చెందారు. సూర్యాపేటలో విద్యాభాసం చేస్తున్నప్పుడే నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమానికి అలుగుబెల్లి నాయకత్వం వహించారు. ఆయన్ను పాఠశాల నుంచి బహిష్కరించడంతో సాయుధపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని, సూర్యాపేట దళానికి నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై రజాకార్లు దాడిచేశారు. 1951లో పార్టీ కేంద్ర కమిటీ పోరాట విరమణను ఆయన వ్యతిరేకించారు. ఆ తరువాత విప్లవ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, 1967లో నక్సల్బరీ మార్గంలో పయనించారు. కరీంనగర్‌ పార్లమెంటు స్థానానికి పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. రెండు దశాబ్దాలకుపైగా న్యూడెమొక్రసీ జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. 

నివాళులర్పించిన మంత్రి : అలుగుబెల్లి వెంకటనరసింహారెడ్డి మృతదేహాన్ని మంత్రి జగదీ్‌షరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట జడ్పీ వైస్‌చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, ధర్మార్జున్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-07-04T06:25:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising