ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెమికల్‌ కంపెనీల్లో నమూనాల సేకరణ

ABN, First Publish Date - 2022-01-23T05:53:42+05:30

భూదాన్‌పోచంపల్లి మునిసిపల్‌ కేంద్రంలోని ఆరు కాలనీల్లో గురువారం రాత్రి విషవాయువు కలకలం రేపింది. సా యంత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు గాలిలో విషవాయువురావడంతో కాలనీల ప్రజ లు భయాందోళనకు గురయ్యా రు. ఘాటైన వాసనతో ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు.

భూదాన్‌పోచంపల్లి కెమికల్‌ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్‌ సేకరిస్తున్న పర్యావరణ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదాన్‌పోచంపల్లిలో పర్యటించిన బృందం సభ్యులు 


భూదాన్‌పోచంపల్లి, జనవరి 22: భూదాన్‌పోచంపల్లి మునిసిపల్‌ కేంద్రంలోని ఆరు కాలనీల్లో గురువారం రాత్రి విషవాయువు కలకలం రేపింది. సా యంత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు గాలిలో విషవాయువురావడంతో కాలనీల ప్రజ లు భయాందోళనకు గురయ్యా రు. ఘాటైన వాసనతో ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. ప్రజల ఇబ్బందులపై ఈనెల 21న శుక్రవారం ‘విషవాయువు కలకలం’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన పర్యావరణ అధికారులు శనివారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని దోతిగూడెం, అంతమ్మగూడెంతోపాటు నారాయణగిరి శివారులోని కెమికల్‌ కంపెనీలను అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా పర్యావరణ ఇంజనీర్లు కుమార్‌ పాటక్‌, రమాబాష, రాబిన్‌ తదితరు లు ఆయా కంపెనీల్లో తనిఖీ నిర్వహించారు. రియాక్టర్లు, ఫోమ్స్‌, ఎఫ్లెంట్‌ తదితర వ్యర్థ, రసాయనాల తరలింపు ప్రక్రియలను పరిశీలించారు. గాలిలో కాలుష్య విషవాయువులు వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ యజమానులను హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీలు నిర్వహిస్తే వారి పై తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దారు బి వీరాబాయి, మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్నం సుదర్శన్‌, ఎస్‌ఐ సైదిరెడ్డిలకు నేతాజీ యువజన సంఘం, వివిధ రాజకీయ పక్షాల నాయకులు వినతిపత్రాలు అందజేశారు. పర్యావరణ అధికారులు మొక్కుబడితనిఖీ లు కాకుండా ప్రజాఆరోగ్యం పరిరక్షించేందుకు కాలుష్య కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2022-01-23T05:53:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising