ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీలగిరి అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి

ABN, First Publish Date - 2022-11-30T00:09:32+05:30

నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన సైదిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామగిరి, నవంబరు 29 : నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం నిర్వహించిన మునిసిపల్‌ అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయ సముద్రం అభివృద్ధికి రూ.30 కోట్లు నిధులు మంజూరయ్యాయని, కళాభారతి ఏర్పాటుకు రూ.90కోట్లతో 20 రోజుల్లో టెండర్లను పిలుస్తామన్నారు. అదేవిధంగా మర్రిగూడ జంక్షన వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.48 కోట్ల టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. రెండు నెలలుగా ఎనహెచ-565 రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. మెడికల్‌ కళాశాల, ఐటీహబ్‌ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పట్టణ అభివృద్ధికి రూ.100కోట్లు కావాలని ఎమ్మెల్యే కోరడంతో రెండు దఫాలుగా నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ హరితహారం పేరిట నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, లక్ష్యమే చూస్తున్నారు తప్ప ఆ మొక్కలు భవిష్యత్తులో పెరుగుతాయా లేదా అన్నది మాత్రం ఆలోచన చేయడం లేదనన్నారు. ఇందిరమ్మ కాలనీలో రాజీవ్‌ గృహకల్పలో మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉందన్నారు. మునిసిపల్‌ వాహనాలు కొన్నింటికీ రిజిస్ట్రేషన కాలేదని, భవిష్యతలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారన్నారు. బీఎ్‌సఎనఎల్‌ ఎదురుగా ఉన్న శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పలు సమస్యలను కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ కేవీ రమణాచారి, అసిస్టెంట్‌ కమిషనర్‌ సయ్యబ్‌ ముసాక్‌ అలీ, ఏపీసీ నాగిరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:09:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising