ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశంలో మబ్బులు.. ఆందోళనలో రైతులు

ABN, First Publish Date - 2022-12-10T01:01:28+05:30

వాతావర ణం ఒక్కసారిగా మారి ఆకాశంలో మబ్బులు కమ్ముకొని చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతోపాటు చిరుజల్లులు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా ఈదురు గాలులకు తోడు మేఘా లు కమ్ముకొస్తుండటంతో కల్లాల్లోని ధాన్యా న్ని కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడిగూడెం, డిసెంబరు 9: వాతావర ణం ఒక్కసారిగా మారి ఆకాశంలో మబ్బులు కమ్ముకొని చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతోపాటు చిరుజల్లులు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా ఈదురు గాలులకు తోడు మేఘా లు కమ్ముకొస్తుండటంతో కల్లాల్లోని ధాన్యా న్ని కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. శుక్రవారం తేలికపాటి చినుకులు కురవగా, మండలంలోని సిరిపురం, నారాయణపురం ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం రాశులపై రైతులు పట్టాలు కప్పి కాపాడుకున్నారు. మండలంలో సుమారు 17వేల ఎకరాలల్లో వరిసాగైంది. సిరిపురం, నారాయణపురం కేంద్రాల్లో 12వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా 5,600 క్వింటాళ్లను ఎగుమతి చేయగా,8,000 క్వింటాళ్లు కేంద్రంలోనే ఉన్నాయి. నడిగూడెం సహకార సంఘం కేంద్రంలో 15,000 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, మరో 3,000 క్వింటాళ్లు కేంద్రంలోనే నిల్వ ఉన్నాయి. కరవిరాల, కాగితరామచంద్రాపురంలో సహకార కేంద్రాల్లో ఇప్పటివరకు ధాన్యపు గింజ కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలో ధాన్యం నిల్వ ఉన్న చోట మబ్బులను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-12-10T01:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising