ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినజీయర్‌ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

ABN, First Publish Date - 2022-01-19T05:56:02+05:30

చినజీయర్‌ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సం ఫూల నాయకులు డిమాండ్‌ చేశారు. దళితులు, బడుగులను హేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడటాన్ని నిరసిస్తూ నల్లగొండ బస్టాండ్‌ సమీపంలో ఉన్న సుభాష్‌ విగ్రహం వద్ద చినజీయర్‌ దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీలు సంఘాల నాయకులు చెరుకు లక్ష్మి, పాలడుగు నాగార్జున, పందుల సైదులు మాట్లాడుతూ చినజీయ

చినజీయర్‌ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ క్రైం, జనవరి 18: చినజీయర్‌ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సం ఫూల నాయకులు డిమాండ్‌ చేశారు. దళితులు, బడుగులను హేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడటాన్ని నిరసిస్తూ నల్లగొండ బస్టాండ్‌ సమీపంలో ఉన్న సుభాష్‌ విగ్రహం వద్ద చినజీయర్‌ దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీలు సంఘాల నాయకులు చెరుకు లక్ష్మి, పాలడుగు నాగార్జున, పందుల సైదులు మాట్లాడుతూ చినజీయర్‌ మాటలు ముమ్మాటికీ దళితుల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని అన్నారు. మానవుల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మాంసాహారం తింటున్న మానవులను జంతువులతో పోల్చడం ఆయన అహంభావానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో నాయకులు ఇందూరి సాగర్‌, కొండేటి మురళి, బొమ్మకంటి కొమరయ్య, దండెంపల్లి సత్తయ్య, కత్తుల చందన్‌, సంగపాక సతీష్‌, ముక్కాముల శ్రీనివాస్‌, శంకర్‌, బొమ్మిడి నగేష్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-19T05:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising