ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి సంపులో పడి చిన్నారి మృతి

ABN, First Publish Date - 2022-12-10T01:45:05+05:30

ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేళ్లచెర్వు, డిసెంబరు 9: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతలపాలెం మండలంలోని వజినేపల్లి గ్రామానికి చెందిన కందుకూరి విద్యాసాగర్‌, కవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు (నాలుగేళ్ల స్లైసీ, రెండున్నర ఏళ్ల శైని) ఉన్నారు. శుక్రవారం పెద్ద కుమార్తెను అంగన్‌వాడీ కేంద్రా నికి పంపారు. శైనిని ఇంట్లో నాయనమ్మ సంరక్షణలో ఉంచి కూలి పనికి వెళ్లారు. ఇంటి ఆవరణలో ఉన్న సంపులో చెత్త పడకుండా పల్చటి రేకును కప్పారు. ఉదయం 11:30 గంటల సమయంలో శైనీ ఆడుకుంటూ రేకు పైకి ఎక్కింది. బరువుకు రేకు అగనందున చిన్నారి నీటిలో పడి మృతి చెందింది. చిన్నారి కోసం నాయనమ్మ ఇంటి చుట్టు పక్కల వెదికినా ఆచూకీ తెలియరాలేదు. చివరకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నీటి సంపులో మనవరాలి మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. గ్రామస్థుల సాయంతో సంపు నుంచి చిన్నారి మృతదేహాన్ని బయటికి తీయించారు. అప్పటివరకు ఆడుతూ తిరి గిన బాలిక గంటల వ్యవధిలోనే మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-12-10T01:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising