ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణాభివృద్ధి అధికారిగా చరణ్‌మౌర్య

ABN, First Publish Date - 2022-01-21T06:54:31+05:30

శాలిగౌరారం మండలం గురజాలకు చెందిన యువకుడు చరణ్‌మౌర్య దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశపరీక్షలో నెగ్గి తన ప్రతిభ చాటాడు.

చరణ్‌మౌర్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాలిగౌరారం, జనవరి 20: శాలిగౌరారం మండలం గురజాలకు చెందిన యువకుడు చరణ్‌మౌర్య దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశపరీక్షలో నెగ్గి తన ప్రతిభ చాటాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ చత్తీ్‌సఘడ్‌ రాష్ట్రం ఉత్తర బస్తర్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి అఽధికారిగా ఎంపికయ్యాడు. శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కోక యాదయ్యసాలమ్మల కుమారుడు చరణ్‌మౌర్య నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో 2021 మార్చిలో నిర్వహించిన ఎంపిక పరీక్షలో అర్హత సాధించాడు. దేశవ్యాప్తంగా రెండు వేలమంది పాల్గొన్న ఈ ప్రవేశ పరీక్షలో విజయం సాధించిన వారిలో 250 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు 2021 జూనలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మౌఖిక పరీక్ష, ఇంటర్వ్యూ అనంతరం చరణ్‌మౌర్యకు ఈ నెల 19వ తేదీన చత్తీ్‌సఘడ్‌ రాష్ట్రం ఉత్తర బస్తర్‌ జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. గురజాలలో పదో తరగతి, నల్లగొండలో ఇంటర్మీడియెట్‌ అనంతరం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో ఎంఏ (సోషియాలజీ) చదువుతున్న చరణ్‌మౌర్య దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యూజీసీ నెట్‌, గేట్‌ అర్హత సాధించాడు. జాతీయ గ్రామీణ అభివృద్ధి అధికారిగా ఎంపికైన చరణ్‌మౌర్యను గ్రామస్థులు అభినందించారు.




 

Updated Date - 2022-01-21T06:54:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising