ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనాభా లెక్కింపులో జాగ్రత్త వహించాలి

ABN, First Publish Date - 2022-01-19T05:36:44+05:30

జనాభా లెక్కింపులో అధి కారులు జాగ్రత్త వహించాలని అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌

నల్లగొండ టౌన్‌, జనవరి 18: జనాభా లెక్కింపులో అధి కారులు జాగ్రత్త వహించాలని అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ సూచించారు. ప్రతీ ఇల్లు, ప్రతీ వ్యక్తి వివరాలు జనాభా లెక్కల్లో కి తీసుకోవాలని, ఎన్యుమరేటర్లు ఈ విషయంలో జాగ్రత్తపడాలన్నారు. కలెక్టరే ట్‌ నుంచి తహసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు, సహాయ గణాంక అధికారుల తో జన గణనపై మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 2021 జనగణనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామం యూనిట్‌గా, అర్బన్‌ ప్రాంతాల్లో మునిసిపల్‌ వార్డు యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు. జనాభా లెక్కలకు సంబంధించి గైడ్‌లైన్స్‌ అర్థం చేసుకు ని, సంబంధిత జాబితాలో వివరాలు నమోదు చేయాలన్నారు. అధికారులు పొరపాట్లకు తావివ్వకుండా, సాంకేతిక సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈనెల 27వ తేదీ వరకు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేయాలన్నారు. నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి అధికారి పీవీ సుబ్రహ్మణ్యం వర్క్‌షీట్లు ఎలా నింపాలో వివరించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి, ఎన్నికల డీటీ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-19T05:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising