ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష

ABN, First Publish Date - 2022-08-08T05:45:12+05:30

ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం జిల్లాకేంద్రంలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 21 కేంద్రాల్లో 8,637 మంది అభ్యర్థులకు 8160 మంది హాజరు కాగా, 437 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలకు సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం జిల్లా నోడల్‌ అధికారిగా వ్యవహరించగా, కోదాడ, చిలుకూరు మండలాల పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

జిల్లా కేంద్రంలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద బారులుతీరిన అభ్యర్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట క్రైం, కోదాడటౌన్‌, చిలుకూరు, ఆగస్టు 7: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం జిల్లాకేంద్రంలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 21 కేంద్రాల్లో 8,637 మంది అభ్యర్థులకు 8160 మంది హాజరు కాగా, 437 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలకు సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం జిల్లా నోడల్‌ అధికారిగా వ్యవహరించగా, కోదాడ, చిలుకూరు మండలాల పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కోదాడ డివిజన్‌లో మొత్తం ఐదు కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు. 2,916 మందికి 2,769 మంది హాజరయ్యారు. 147 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ తీరును కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, పట్టణ సీఐ నర్సింహారావు, రూరల్‌ సీఐ దుర్గాప్రసాద్‌ పర్యవేక్షించారు. 


కొంపముంచిన గూగుల్‌ మ్యాప్‌ 

పాలకీడు మండలం కోమటికుంటకు చెందిన ముని జయదేవ్‌కు పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎమ్‌ పాఠశాల సెంటర్‌ను కేటాయించారు. అయితే అతను గూగుల్‌ మ్యాప్‌ ద్వారా కోదాడకు వస్తుండగా ఎస్‌ఆర్‌ఎమ్‌ పాత స్కూల్‌కు మ్యాప్‌ చూపడంతో అటు వెళ్లాడు. తీరా చూస్తే అది పాత పాఠశాల అని, కొత్త పాఠశాల హుజూర్‌నగర్‌ రోడ్డులో ఉందని అక్కడి వారు చెప్పడంతో, సెంటర్‌కు చేరుకునేలోగా 10 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో అతడు పరీక్ష రాయకుండానే వెనుదిరిగాడు.


అభ్యర్థులు ఎవరూ మోసపోవద్దు : ఎస్పీ 

నోటిఫికేషన్ల నేపథ్యంలో కొంతమంది మోసగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెబుతున్నారని అభ్యర్థులు మో సపోవద్దని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - 2022-08-08T05:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising