ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుద్ధవనంలో బౌద్ధ పరిమళాలు

ABN, First Publish Date - 2022-05-16T06:24:02+05:30

నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో ని ర్మించిన బుద్ధవనం బౌద్ధ పరిమళాలను వెదజల్లుతోందని కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన బౌద్ధ మత గురువులు (మాంక్‌) అన్నా రు.

నాగార్జునకొండపై సింహళీయం వద్ద బౌద్ధ మత గురువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటక రాష్ట్ర బౌద్ధ మత గురువులు

నాగార్జునసాగర్‌, మే 15: నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో ని ర్మించిన బుద్ధవనం బౌద్ధ పరిమళాలను వెదజల్లుతోందని కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన బౌద్ధ మత గురువులు (మాంక్‌) అన్నా రు. ఆదివారం వారు బుద్ధవనంలో కలియతిరిగి జాతక వనం, స్తూ ప వనం, చరిత వనం, మహాస్తూపం మ్యూజియంలను వారు తిలకించారు. నాగార్జునకొండపై మ్యూజియం, సింహాళీయ స్తూపాలను, నమూనాలను తిలకించి సింహాళీయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మ్యూజియంలో భద్రపరచిన బుద్ధుడి బంగారు ధాతువును తిలకించి మంత్ర ముగ్ధులయ్యారు. బుద్ధుడి బంగారు ధాతువును తలపై పెట్టుకొని తమ జీవితం ధన్యమైందన్నారు. నాగార్జునకొండను సందర్శించిన బౌద్ధ మత గురువుల్లో మైసూరుకు చెందిన షేరే బౌద్ధరామం బుద్ధిస్ట్‌ మాంక్‌ నవంగ్‌ జుమ్నేగిషే, లోప్‌ సంగ్‌ చోప్ని, తుషైన చోటా, తుషైన థక్షే, లోప్‌సంగ్‌ కుంఝన, తుషైన సన సింఘే ఉన్నారు.పై ఉన్న ఒక్కొక్క శిల్పం గురించి వారికి బౌద్ధ విశ్లేషకులు ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. వారి వెంట బుద్ధవనం శిల్పి శ్యాంసుందర్‌, పర్యాటక శాఖ గైడ్‌ సత్యనారాయణ, రాజ్‌కుమార్‌, రాంకుమార్‌, కమలాసన తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-16T06:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising