బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయం
ABN, First Publish Date - 2022-12-07T00:26:35+05:30
రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
సూర్యాపేటటౌన్, డిసెంబరు 6: రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని నెహ్రునగర్‌లోని పార్టీ కార్యాలయాన్ని సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలనకు త్వరలోనే చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఎస్పీ బలోపేతానికి కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పనిచేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా, నియోజకవర్గంలో బీఎస్పీ కార్యాలయాలను ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రం మొత్తం త్వరలో నీలిరంగు మయంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బుడిగె మల్లయ్యయాదవ్, దాసరి శ్రీను, దాసరి రాములు, బత్తిని సరిత, కొండ బీమాగౌడ్, దశరథ, చెరుకుపల్లి లక్ష్మణ్, పెరుమాళ్ళ సునీత, నిరోష, నాగబాబు, రమ, మనీషా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:26:39+05:30 IST