ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2022-12-12T01:14:35+05:30

పేదల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు ఆసరా పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.

క్రిస్మస్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌, డిసెంబరు 11: పేదల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు ఆసరా పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్‌నాథ్‌రెడ్డి, కేఎల్‌ఎన్‌ రెడ్డి, శంభయ్య, నాగేశ్వరరావు, సతీష్‌, భాస్కర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో వేడుకలను నిర్వహించుకోవాలి

ప్రతీఒక్కరూ ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్‌ వేడుకలను నిర్వ హించుకోవాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి కోరారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్‌ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్ని పండుగలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. కార్యక్రమంలో రవికాంత్‌, శంకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ప్రదీప్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T01:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising