ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భువనగిరిలో ఘనంగా బోనాల పండుగ

ABN, First Publish Date - 2022-08-08T05:52:05+05:30

తెలంగాణ సంప్రదాయ బోనాల వేడు కలను జిల్లాకేంద్రం భువనగిరిలో ఆదివారం ఘనంగా జరుపుకు న్నారు.

భువనగిరిలో బొడ్రాయికి జలాభిషేకం చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, అగస్టు 7: తెలంగాణ సంప్రదాయ బోనాల వేడు కలను జిల్లాకేంద్రం భువనగిరిలో ఆదివారం ఘనంగా జరుపుకు న్నారు. హనుమాన్‌వాడ సంజీవనగర్‌, ఆర్‌బీనగర్‌, అర్బన్‌కాలనీ అంబేడ్కర్‌ నగర్‌, శ్రీరాంనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వేడుకలను జరుపుకున్నారు. బోనాల ఊరేగింపు నిర్వహించి గ్రామ దేవతలకు నైవేథ్యం సమర్పించారు. అమ్మవారికి వడిబియ్యం తదితర మొ క్కులను చెల్లించుకున్నారు. బాణాసంచా, డప్పు చప్పుళ్లు, శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు గ్రామ దేవతల వేషదారణల నడుమ అట్టహాసంగా బోనాల ఊరేగింపులు కొనసాగాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన అంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, జిల్లా గ్రంథాలయ, రైతు బంధు సమితి చైర్మన్లు డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, కొలుపుల అమరేందర్‌, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు, రాష్ట్ర నాయకుడు తదితర ప్రముఖులు వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. కౌన్సిలర్లు, రాజకీయ పార్టీల నాయకులు వేడుకల నిర్వాహకులు తదితరులు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. 

తుర్కపల్లి: పలుగుల మైసమ్మ బోనాల ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సీఎం దత్తత గ్రామమైన వాసాల మర్రిలో ఆదివారం పలుగుల వంశీయులు, గ్రామస్థులతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, ఒడి బియ్యం సమర్పించారు. సాయంత్రం ఆలయం వద్ధ నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పొతరాజుల వేషాలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాలతో బోనాలను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ధూప దీప నైవేధ్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్‌ పలుగుల మహేందర్‌, ప్రచార కమిటీ చైర్మన్‌ పలుగుల రమేశ్‌, ఎంపీటీసీ పలుగుల రమేశ్‌, పలుగుల లింగయ్య, నర్సింగరావు, రమణయ్య, అమరేందర్‌, శ్రీనివాస్‌, ప్రేమ్‌చందర్‌, పలుగుల వెంకటేశ్‌, ప్రకాశ్‌, ఆంజనేయులు, రవికుమార్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising