ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు వరం కల్యాణలక్ష్మి పథకం

ABN, First Publish Date - 2022-01-24T06:02:07+05:30

పేదలకు వరం కల్యాణలక్ష్మి పథకం అని ఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి అన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తున్న సుఖేందర్‌రెడ్డి, భాస్కర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి

మిర్యాలగూడ, జనవరి 23: పేదలకు వరం కల్యాణలక్ష్మి పథకం అని ఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని 310 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.3.10కోట్ల చెక్కులను ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరికొత్త ఆలోచన చేస్తూ సంక్షేమపథకాలను అమల్లోకి తెస్తున్నారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, ఎంపీపీలు నూకల సరళహన్మంతరెడ్డి, నందిని రవితేజ, శ్రీవిద్యరాజు, బాలాజీ నాయక్‌, జడ్పీటీసీలు ఇరుగు మంగమ్మవెంకటయ్య, సేవ్యానాయక్‌, లలితహాతీరాంనాయక్‌, తహసీల్దార్‌ గణేష్‌, ఆర్‌ఐ శ్యాం సుందర్‌, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్దంగా ముందస్తుచర్యలు చేపట్టిందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని షాబునగర్‌లో జ్వరసర్వేను ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మునిసిపల్‌ చైర్మన్‌ భార్గవ్‌, మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డిలతో కలిసి పరిశీలించారు. అదే విధంగా పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపు ఆవరణలో జరుగుతున్న మినీ రవీంద్రభారతి, అంబేడ్కర్‌ భవన్‌, సంత్‌సేవాలాల్‌, జ్యోతిరావుపూలే భవన నిర్మాణ పనులను గుత్తా సుఖేందర్‌రెడ్డి పరిశీలించారు.  

Updated Date - 2022-01-24T06:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising