ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదిగలను మోసం చేస్తున్న బీజేపీ

ABN, First Publish Date - 2022-12-15T00:19:45+05:30

మాదిగలను మోసం చేస్తున్న బీజేపీ

సమావేశంలో మాట్లాడుతున్న టీఎమ్మార్పీస్‌ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, పక్కన రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు(ఎం), డిసెంబరు 14: మనవాద ముసుగులో బీజేపీ మాదిగలను మోసం చేస్తోందని టీఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. బుధవారం ఆత్మకూరు(ఎం) మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ అవలంభిస్తున్న మనువాదానికి మాదిగవాదంతోనే బుద్ధి చెప్పాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో అన్ని పార్టీల ఎంపీలు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడాలని కోరారు. కేంద్రం మెడలు వంచైనా వర్గీకరణ సాధించి తీరుతామన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనకై టీఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ధిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఈ నెల 19న నిర్వహించే చలో దిల్లీ-మాదిగల లొల్లి కార్యక్రమంలో మాదిగలు, ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎంఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటేశ్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కూరెల్ల రమేశ్‌, నాయకులు డి.నాగరాజు, కె. వెంకట్‌, రాములు, యాదయ్య, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:19:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising