ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్గీకరణ చేపట్టకుండా మోసం చేస్తున్న బీజేపీ

ABN, First Publish Date - 2022-07-01T07:10:01+05:30

ఎస్సీ వర్గీకరణ చేపట్ట కుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసంచేస్తోందని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద మందకృష్ణమాదిగ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు కృష్ణమాదిగ

కోదాడ రూరల్‌, జూన్‌ 30: ఎస్సీ వర్గీకరణ చేపట్ట కుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసంచేస్తోందని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. కేంద్ర ప్రభుత్వతీరును నిరసిస్తూ ఈ నెల 2న చేపట్టే సడక్‌ బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు కోదాడ మండలంలోని సరిహద్దులోని రామాపురం క్రాస్‌రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేపడతామని చెప్పిన బీజేపీ, ఎనిమిదేళ్లుగా చర్యలు తీసుకోకుండా మాదిగలను మోసం చేస్తుందన్నారు. మం త్రులు సైతం పలు విధాలా వాయిదాలు వేస్తూ మాదిగలను మోసం చేశారన్నారు. ఈ నెల 2, 3 తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతకై తీర్మానం చేయకపోతే ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, బీజేపీ నాయకులను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. సడక్‌బంద్‌ను విజయవంతం చేసేందుకు రామాపురం క్రాస్‌రోడ్డు వద్దకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున మాదిగలు హాజరవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఏపూరి రాజు, కొండపల్లి ఆంజనేయులు, యల మర్తి రాము, వడ్డేపల్లి కోటేష్‌, కందుకూరి రామయ్య, కందుకూరి శ్రీను, అన్నెపాక రమేష్‌, అనిల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T07:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising