ప్రచారంలో బడా నేతలు
ABN, First Publish Date - 2022-10-17T05:58:49+05:30
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో 18 రోజులు మాత్రమే గడువు ఉండడంతో నియోజకవర్గంలో ఆయా పార్టీల బడా నేతల ప్రచారం హోరెత్తుతోంది. నవంబరు 1వ తేదీ సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగించాల్సి ఉండగా, ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు నియోజకవర్గంలోని ఏడు మండలాలను చుట్టేస్తున్నారు.
పల్లెలను చుట్టేస్తున్న నాయకులు
నేటి నుంచి రేవంత్, రేపటి నుంచి బండి రోడ్‌షోలు
నల్లగొండ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో 18 రోజులు మాత్రమే గడువు ఉండడంతో నియోజకవర్గంలో ఆయా పార్టీల బడా నేతల ప్రచారం హోరెత్తుతోంది. నవంబరు 1వ తేదీ సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగించాల్సి ఉండగా, ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు నియోజకవర్గంలోని ఏడు మండలాలను చుట్టేస్తున్నారు. దీంతో ప్రతీ గ్రామంలో ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు ఓ వైపు చేరికలను ప్రోత్సహిస్తూ, మరోవైపు ప్రచారం సాగిస్తున్నాయి. పార్టీల్లో చేరికల్లో ప్రధానంగా బీజేపీ, టీఆర్‌ఎస్ బిజీగా ఉండగా, ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా, బడా నాయకులు గ్రామాలకు వచ్చి ఇంటింటి ప్రచారం చేస్తుండటంతో క్యాడర్‌లో జోష్ పెరుగుతోంది.
క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యే
అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు క్షేత్ర స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మంత్రులు జగదీ్‌షరెడ్డితో పాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివా్‌సయాదవ్, మల్లారెడ్డి పల్లెల్లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నా రు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ రోజు చండూరుకు వచ్చి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి జగదీ్‌షరెడ్డి నిరంతరం మునుగోడు నియోజకవర్గంలో ఉంటూ ప్రచారాన్ని సాగిస్తూ పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ, పార్టీ నుంచి ఎవ్వరూ జారిపోకుండా రాజకీయం నెరపుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం గ్రామాల బాటపట్టారు.
పల్లెపల్లెకు బీజేపీ అగ్ర నాయకులు
నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడెం, గట్టుప్పల్, సంస్థాన్‌నారాయణపురం మండలంలోని అన్ని గ్రామాలకు బీజేపీ అగ్ర నాయకులు చేరుకొని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు నిరంతరం పల్లెల్లో ప్రచారం సాగిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓ వైపు ప్రచారం చేస్తూ మరోవైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 18వ తేదీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 12 రోజుల పాటు నియోజకవర్గంలో రోడ్‌షోలు, సభల్లో పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి పర్యవేక్షణలో మర్రిగూడలో రోడ్‌షో ప్రారంభించి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. బండి సంజయ్ వెంట రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు కొన్ని ప్రాంతాల్లో జాతీయ నాయకులు సైతం పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు.
నేటి నుంచి రేవంత్ రోడ్‌షోలు
కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మునుగోడులో సభ నిర్వహించి ఆతరువాత పలు రోడ్‌షోల్లో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం నుంచి తిరిగి నియోజకవర్గంలో రెండో విడత రోడ్‌షోలు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం 4గంటల రాత్రి 10 గంటల వరకు సంస్థాన్‌నారాయణపురం మండలంలో, 18న చౌటుప్పల్ మునిసిపల్‌తోపాటు మండలంలో,19 న మునుగోడు మండలంలో, 20న మర్రిగూడెం మండలంలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు.
ప్రచారానికి 16 రోజులే
ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 3వ తేదీన నిర్వహించనున్నారు. ప్రచారం నవంబ రు 1వ తేదీ సాయంత్రం 5 గంటలకే ముగియనుంది. ప్రచారానికి 16 రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులంతా సమయం వృథా కాకుండా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మొహరించి ప్రచారం సాగిస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటు కొంత మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారం ఉధృతం చేశారు. ప్రధానంగా మూడు పార్టీల మధ్యే హోరాహోరీపోటీ ఉండటంతో రానున్న రోజుల్లో ప్రచారంలో మ రింత దూకుడు పెంచేందుకు పార్టీలు ప్రణాళి క సిద్ధం చేసుకుని ముందుకువెళ్తున్నాయి.
టీఆర్‌ఎస్ కౌంటర్ ఆపరేషన్
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్‌ఎ్‌సను అనూహ్యంగా వీడి బీజేపీలో చేరనుండటంతో అధికార పార్టీ కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పటికే పల్లె రవికుమార్‌తో ఎంపీపీ అయిన ఆయన భార్యను టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారు. నర్సయ్యగౌడ్ పార్టీ వీడిన మరుక్షణమే వీరిని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని ఆయన సామాజికవర్గానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాన్ని పంపారు. మంత్రి జగదీ్‌షరెడ్డి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండి పార్టీలో చేరికలను పెద్ద సంఖ్యలో ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే చండూరు మండలానికి చెందిన ఐదుగురు సర్పంచ్‌లు, మునుగోడు మండలంలో ఒక సర్పంచ్ బీజేపీని వీడి మంతిర సమక్షంలో టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. బూర నర్సయ్యగౌడ్ పార్టీని వీడటంతో మంత్రి జగదీ్‌షరెడ్డి వెనువెంటనే స్పందించి నష్టనివారణ చర్యలను వేగవంతం చేశారు.
నామినేన్ల ఉపసంహరణకు నేడే చివరి గడువు
చండూరు: మునుగోడు ఉప ఎన్నికకు ఈనెల 17న సాయం త్రం 3గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు. ఈ నెల 7వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగగా, ఈనెల 14వ తేదీ చివరి గడువు వరకు 130మంది అభ్యర్థులు మొత్తం 199సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 15న నామినేష న్ల పరిశీలన ప్రక్రియ పూర్తికాగా, వివిధ కా రణాలతో 47మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో బరిలో 83మంది మిగిలారు. ఆదివారం సెలవు దినం కావడంతో నామినేషన్లను ఎవ్వరూ ఉపసంహరించుకోలేదు. సోమవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు కాగా, బరిలో ఎంతమందో తేలనుంది.
Updated Date - 2022-10-17T05:58:49+05:30 IST