నేటి నుంచి పెద్ద పండుగ తిరునాళ్లు
ABN, First Publish Date - 2022-04-25T06:30:42+05:30
దక్షిణ తెలంగాణలో అతిపెద్ద చర్చిగా పేరొందిన మఠంపల్లి శుభవార్త దేవాలయంలో 26వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 25 నుంచి 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలకు నిర్వాహకులు ఏర్పాట్లుచేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిని అలంకరించారు.
మఠంపల్లి శుభవార్త దేవాలయం ముస్తాబు
మఠంపల్లి, ఏప్రిల్ 24: దక్షిణ తెలంగాణలో అతిపెద్ద చర్చిగా పేరొందిన మఠంపల్లి శుభవార్త దేవాలయంలో 26వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 25 నుంచి 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలకు నిర్వాహకులు ఏర్పాట్లుచేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిని అలంకరించారు. కృష్ణానది తీరాన నిర్మించిన శుభవార్త దేవాలయం భక్తుల కోర్కెలు తీర్చే చర్చిగా నిలిచింది. మంగళవార్త చర్చిని 1968లో నిర్మించగా, 1993లో పునర్నిర్మాణం చేశారు. నాటి నుంచి ఈ చర్చిని శుభవార్త దేవాలయంగా పిలుస్తున్నారు. ఏటా, ఏప్రిల్ 25, 26 తేదీల్లో వార్షికోత్సవాన్ని క్రైస్తవులు పెద్ద పండుగగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 25 ఉదయం 9గంటలకు శభవార్త పండుగ సమిష్టి దివ్యబలిపూజ, మధ్యా హ్నం 2గంటల నుంచి ఒత్తుల సమర్పణ, సాయంత్రం 5గంటలకు మరియమాత ఊరేగింపు, 26 ఉదయం 7గంటలకు దివ్యబలిపూజ(పెద్దల పూజ) నిర్వహించనున్నట్టు విచారణ గురువు మార్టిన్ పసల తెలిపారు. అదేవిధంగా వేడుకల సందర్భంగా శుభోదయ యువజన సంఘం ఆద్వర్యంలో ఈనెల 26 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలస్థాయి మహిళా కోలాట ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు.
Updated Date - 2022-04-25T06:30:42+05:30 IST