భువనగిరి ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని వాట్సాప్‌లో పోస్ట్
ABN, First Publish Date - 2022-10-17T06:02:52+05:30
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ పెట్టిన హైదరాబాద్‌కు చెందిన ‘పోలీస్ నిఘా’ విలేకరి నీలం శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
ఫ ‘పోలీస్ నిఘా’ హైదరాబాద్ విలేకరిపై కేసు నమోదు
యాదాద్రి, భువనగిరి టౌన్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ పెట్టిన హైదరాబాద్‌కు చెందిన ‘పోలీస్ నిఘా’ విలేకరి నీలం శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. యాదాద్రి రాచకొండ పోలీస్ నిఘా వాట్సప్ గ్రూపులో ఎమ్మెల్యేపై తప్పుడు పోస్టింగ్ పెట్టారని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తప్పుడు పోస్టింగ్‌పై లోతైన విచారణ చేస్తున్నామని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టీఆర్ఎస్ను వీడేది లేదు : భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
టీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని, కడదాక ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటా నని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిందని, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తు లపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
Updated Date - 2022-10-17T06:02:52+05:30 IST