ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ జోడో యాత్ర చరిత్రాత్మకం

ABN, First Publish Date - 2022-10-07T05:30:00+05:30

రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర చరిత్రాత్మకమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు.

కోదాడలో పాదయాత్రలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ లక్ష్మీనారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి 

కోదాడ, అక్టోబరు 7: రాహుల్‌ భారత్‌   జోడో యాత్ర చరిత్రాత్మకమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు.  రాహుల్‌ పాదయాత్రకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం అనంతగిరి నుంచి కోదాడ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు.  మతతత్వ శక్తులతో దేశం ఛిన్నాభిన్నం అవుతుండగా,  రాహుల్‌ భారత్‌ యాత్ర దేశాన్ని ఏకం చేస్తోందన్నారు.  రాహుల్‌ మద్దతుగా పాదయాత్ర చేపట్టిన అనంతగిరి మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఆయన అభినం దించారు. అనంతరం రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో ముస్కు శ్రీనివాస్‌ రెడ్డి, గోపాల్‌రెడ్డి, డేగకొండయ్య, కోటేశ్వరరావు, కంపాటి శ్రీను, నాగిరెడ్డి, శ్రీధర్‌, బాగ్ధాద్‌, శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ, డేగ యూత్‌ కోదాడ బృందాలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం

అనంతగిరి:  దేశంలో, రాష్ట్రంలో  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయ కుడు  డేగ కొండయ్య అన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు సంఘీ భావంగా మండల కేంద్రంలో బీసీ కాలనీ నుంచి కోదాడలోని రాజీవ్‌ చౌక్‌ వరకు పాదయాత్ర నిర్వహిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో రాష్ట్రానికి ఒరిగింది ఏమీలేదన్నారు. లక్ష కోట్ల అవినీతి సొమ్ముతో కేసీఆర్‌  బీఎస్‌ఆర్‌ పార్టీని స్థాపించారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్‌ తమ కుటుం బంలో అందరికీ పదవులు ఇచ్చుకున్నారన్నారు.  దేశంలోని ప్రభుత్వ సంస్థ లను కార్పొరేట్‌శక్తుల పరం చేశారన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల  అధ్యక్షుడు కొండపల్లి వాసు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గునుకుల గోపాల్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు పందిరి నాగిరెడ్డి, నాయ కులు డేగబాబు, వెంకట్‌రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లుపాల్గొన్నారు. 

 రాహుల్‌ పాదయాత్రను విజయవంతం చేయాలి 

తిరుమలగిరి రూరల్‌: రాష్ట్రంలో రాహుల్‌గాంధీ ఈనెల 24 నుంచి చేపట్టే భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలని గుండెపురి ఎంపీటీసీ జుమిలాల్‌ అన్నారు. మండలంలోని బండ్లపల్లి గ్రామంలో పాదయాత్రకు సంబంధించిన టీ షర్టులను కాంగ్రెస్‌ కార్యకర్తలకు పంచారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ దేశంలో బీజేపీ మతోన్మాద చర్యలకు వ్యతి రేకంగా రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల బీసీ సెల్‌ అధ్యక్షులు గూడ నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షుడు టీక్యా, నాయకులు రాఖేష్‌, మహేష్‌, రాజు, భిక్షం, చంద్రయ్య, జహంగీర్‌, బాలకృష్ణ, సోమన్న, లింగన్న, యాదయ్య, సాలయ్య, నర్సయ్య, వెంకన్న, లక్ష్మయ్య, ప్రవీణ్‌, సందీప్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-10-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising