ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం

ABN, First Publish Date - 2022-12-31T23:00:53+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం హరిహరులను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంతాల్లో భక్తజనుల సంచారంతో రద్దీగా కనిపించాయి.

నిత్య కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు, కల్యాణంలో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాస్త్రోక్తంగా నిత్యారాధనలు..తిరుప్పావై పర్వాలు

యాదగిరిగుట్ట, డిసెంబరు31: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం హరిహరులను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంతాల్లో భక్తజనుల సంచారంతో రద్దీగా కనిపించాయి. కొండపైన దర్శన క్యూలైన్లు, ప్రసాదాల విక్రయశాల, ఆలయ తిరువీధుల్లో భక్తుల కోలాహలం నెలకొంది. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులు ఇష్టదైవాలను దర్శించుకుని ఆర్జిత సేవోత్సవాల్లో కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభాతవేళ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా రెండో రోజు తిరుప్పావైపర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ప్రధానాలయ ఉత్తర ఈశాన్య ప్రాకార మండపంలో ఆండాళ్‌ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు ప్రత్యేకవేదికపై తీర్చిదిద్దారు. అర్చకబృందం ఆండాళ్‌ అమ్మవారు శ్రీరంగనాథుడిని కొలుస్తూ ఆలపించిన తిరుప్పావై పాశుర పఠనం జరిపి కట్టెపొంగలి ప్రసాదాలను నివేదన జరిపి వితరణ చేశారు. మహిళాభక్తులు అమ్మవారికి మంగళహారుతులు నివేదించారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలో ధనుర్మాస వేడుకలు వైభవంగా నిర్వహించారు. పాతగుట్ట ప్రధానాలయ ముఖమండపంలో ఆండాళ్‌ అమ్మవారిని కొలుస్తూ పాశుర పఠనం చేసి, మంగళ నీరాజనాలు పాడారు. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు గర్భాలయంలోని స్వయంభువులకుు, ప్రతిష్టా అలంకారమూర్తులకు నిజాభిషేకం జరిపి సహస్రనామార్చనలు నిర్వహించారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలను ఆగమశాప్త్రరీతిలో నిర్వహించారు. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు, నిత్యరుద్రహవన పూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. ఇదిలా ఉండగా దేవస్థాన సిబ్బంది పాతగుట్ట ప్రధానాలయ ముఖద్వారం బంగారు తాపడంకోసం తమ వేతన నుంచి ఇచ్చిన రూ.30లక్షల విరాళంతో తయారు చేసిన స్వర్ణ తాపడ రేకులకు సంప్రదాయరీతిలో అర్చకబృందం పూజలు నిర్వహించారు. త్వరలోనే బంగారు తాపడం చేసిన రేకులను ముఖద్వారానికి బిగించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2022-12-31T23:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising